Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాదీలందరికీ ఫైన్ బిస్కెట్ అంటే మహాప్రీతి. ఉస్మానియా బిస్కెట్కే పరిమితం కాకుండా అప్పుడప్పుడు ఫైన్ బిస్కెట్ కూడా ట్రై చేయండి. మీ చారుకి మంచి రుచి తోడవుతుంది. ఫైన్ బిస్కెట్ ను అలా తుంచి తింటూంటే... ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేం.
ఫైన్ బిస్కెట్ ముక్కను అలా టీ కప్పులో ముంచగానే పొరలుపొరలుగా వస్తూ.. దాన్ని ముంచిన చారు సిప్ చేయగానే అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఇక ఫైన్ బిస్కెట్ పై అంటుకుని ఉండే చక్కెర దోరగా వేగిన పొరతో కరకరలాడుతూ నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతూ మరింత రుచిని అందిస్తుంది. ఎన్ని మాటలు చెప్పుకున్నా ఒక్క ఫైన్ బిస్కెట్స్ తింటే... ఆ అనుభూతి ముందు ఈ మాటలన్నీ దిగదుడుపే. హైదరాబాద్లో ఉండే వాళ్ళు వెంటనే ఓ సారి రుచి చూడండి. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారైతే ఈసారి హైదరాబాద్ వస్తే మాత్రం కచ్చితంగా రుచి చూస్తారు కదూ!