Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోషల్ మీడియా వేదికగా తమ వీడియోలతో దుమ్ము దులిపేస్తున్నారు యువత. తమ నటన, డ్యాన్సులతో లక్షల్లో ఫ్యాన్స్‌ను సంపాదించు కుంటున్నారు. ఒకప్పుడు డబ్‌స్మాష్‌లు చేయగా.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం టిక్ టాక్‌తో మారుమోగుతోంది. మ్యూజిక్ క్లిప్స్‌కు తమ నటనను జోడిస్తూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. మరి ఆ విశేషాలేంటో చూద్దాం..
ఈ మద్య కాలంలో యూత్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేసింది 'టిక్ టాక్' యాప్. ఇప్పుడు ఈ 'టిక్ టాక్' కి యూత్ బాగా అడిక్ట్ అయ్యారు. టిక్ టాక్ అనే యాప్ చూడటానికి డబ్ స్మాష్లానే ఉంటుంది. కానీ, ఇందులో మ్యూజికల్ వీడియోస్ ఉంటాయి. ఈ యాప్ ద్వారా ఒకే వీడియోలో ఇద్దరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే.. ఆల్రెడీ చేసిన వీడియోని ఇతరులు కూడా వాడొచ్చు. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఈ ఎమోషన్స్ అన్ని ఈ 'టిక్ టాక్' ద్వారా యూత్ తమ టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు.
మోస్ట్ ఎంటర్టైనింగ్ యాప్‌గా
తమని తాము ప్రూవ్ చేసుకుని సోషల్ మీడియాలో సత్తా చాటి రంగుల ప్రపంచంలోకి అడుగుపెడదామని కలలుకంటున్న యూత్ మొత్తం 'టిక్‌టాక్'కి అడిక్ట్ అవుతున్నారు. ఈ కారణం చేతనే 2018లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన మోస్ట్ ఎంటర్టైనింగ్ యాప్ అవార్డు పొందింది 'టిక్ టాక్'. ఈ టిక్ టాక్ లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు తమ టాలెంట్ తో వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. వీరు చేసిన వీడియోకి లైక్స్ కూడా ఉంటాయి. ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తే వారు ఫేమస్ అవుతు ఉంటారు. లైకుల కోసం వారు తమ టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. కోంత మంది ఫన్నీ, చేస్తే కోంత మంది సాడ్ ఎమోషన్స్‌తో వీడియోలు చేస్తున్నారు. ఇక మరికొంత మంది తమ డ్యాన్స్ తో వీడియోలు చేస్తు అందరిని అట్రాక్ట్ చేస్తున్నారు.
పల్లెల నుండి ఎక్కువ
టిక్ టాక్‌లో వీడియోలు చేస్తున్న భారతీయుల్లో అధిక శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉండడం గమనార్హం. దీనిబట్టి 'టిక్ టాక్' ఎంత పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్‌కి పోటీగా టిక్ టాక్ వీడియోలు చేసేవారికి కూడా, భారీ మొత్తంలో ఫాలోయర్స్ ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకులు తమ దగ్గర ఉన్న వినూత్నమైన ఆలోచనలను టిక్ టాక్ వీడియోల రూపంలో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. వీరికి ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది.
చైనాలో ప్రారంభమైన టిక్ టాక్
2016లో చైనాలో ఈ ప్రారంభించబడిన ఈ అప్లికేషన్ పాపులారిటీ గత సంవత్సరం Musical.lyలో విలీనమైన తర్వాత మరింత పెరిగింది. ఎలాంటి ప్రత్యేకమైన సెటప్ లేకుండా ఫోన్‌ని చేతిలో పట్టుకుని గానీ లేదా సెల్ఫీ స్టిక్ ఉపయోగించి కానీ రెడీమేడ్‌గా ఉండే డైలాగులు, పాటలకు తగ్గట్లు లిప్ సింక్ చేస్తూ చాలా వేగంగా వీడియోలు చేయగలగటం అందరినీ బాగా ఆకర్షించింది.
'టిక్ టాక్' టీషర్ట్స్
టిక్ టాక్ ఎంత ఫేమస్ అయ్యిందంటే టిక్ టాక్ పేరుతో టీషర్ట్స్ కూడా వచ్చాయి. టిక్ టాక్ లోగోతో టీషర్ట్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఈ టీషర్ట్స్‌ను యువకులను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి.
లైక్స్ కోసం ప్రమాదకర స్టంట్స్
అయితే, టిక్‌టాక్‌లో కొంతమంది యూత్ తమ వీడియోలకు ఎక్కువగ లైక్స్ రావాలని ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు కూడా. మరి కొంత మంది ప్రమాద అంచుల వరకు వెళ్లి వచ్చారు కూడా. ఈ టిక్ టాక్ వీడియోల కోసం యూత్ తమ ప్రాణలను సైతం లేక్క చేయకుండా లైక్స్ కోసం వీడియోలు చేస్తున్నారు. అందుకే ఇలాంటి విషయాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలి.
అడల్ట్ కంటెంట్‌తో...
'టిక్ టాక్'లో కొంతమంది అడల్ట్ కంటెంట్‌ని కూడా అప్లోడ్ చేస్తున్నారు. కొందరు యువతులు... రకరకాల ఫోజులతో చెలరేగిపోతుండడం, మరికొంత అసభ్యకరమైన పదాలు వాడడం, మరికొంతమంది వికృతచేష్టలు, పిచ్చి పనులు చేస్తూ కూడా ఆ వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తూ పెడదోవ పట్టిస్తున్నారు. ఇలాంటివి అప్లోడ్ చేసుకునే సమయంలో జాగ్రత్త అవసరం.
- కె.రాజ్
8977442962