Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జయహో!
ఆమె అంటే
ఎందుకో ఎలానో
తెలీని అభిమానం
చూసిన కళ్ళు
పదేపదే పాపలపై
కదలాడే ఆమెని
రెప్పలమాటున దాచేస్తున్నాయి
ఆమె రెటినా నుండి
మనసు కేంద్రలోలకంలో
అలాఅలా ఊగుతూ
స్థిరనివాసమేర్పరచుకుంది
అస్థిరం కాదిక
మరోమాటే లేదిక
ఆమెదే ఆ స్థానం
పదిలమికజి
తొణకని మనసు
ఊహల జంపాల
ఇలలో స్వర్గపుటంచుల తాకేస్తూ
ఆమె అనుమతికై నిరీక్షణ
ఏకపక్షం ఎర్రి కాకూడదులే
ఆమె ఆలోచించింది
సరిజోడు కాదనుకుంది
కాదన్నది ప్రేమని
సముదాయించుకున్నా
రెండు మనసుల కలయిక
రెండు హ దయాల ఏకం
సాధ్యం కాట్లేదని
నా దారి నాది
ఆమె దారి ఆమెది
జీవితంలో ఓ మజిలీ అంతే
కోల్పోయినా తాత్కాలికమే
మరో తెర తీయగా
తియ్యనైన మజిలీ సాక్షాత్కారం
గెలుపో ఓటమో కాదది
స్పందనల హౌరులో తుఫాను
కాలమే మరిపించు
క్షణికావేశమొదిలేరు
కొత్త బాణీ అందుకో
జయహౌ! జీవితం
- గిరిప్రసాద్ చెలమల్లు
9493388201
ఉపదేశం
ఏనాటి గాయాలు
పెల్లుబికాయో
ఆమె యదసంద్రముప్పొంగి
కంటి ఆనకట్టలు తెంపుకుంది
మాటల మంత్రమేయడం
నాకు తెలియదు
ఆలింగనాల అడ్డుకట్ట
వేసాను
ఆమె గోముగా నాచెవిలో
ఉపదేశం చేసింది
ఇదేకదా నేను కోరేది అంటు...
- నాగ్రాజ్, జగిత్యాల