Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముడుచుకు పోయి మురిపెం
కోసం ఎదురు చూస్తున్న
నా హృది పుష్పాన్ని
వికసింపచేసి పరిమళించిన
పాణీగృహితి.
గమ్యం గతిని శృతి చేయని
పయనానికి అడుగులు
వేయించి పరితుష్టి
ప్రమిదలై ప్రకాశితములు
నింపిన నీరజాక్షి
నిస్తేజం నిండిన గుండెల్లో
ప్రేమ మొలకలను మొలిపించి
అనందాల హరివిల్లులు
పండించిన పరువాలనిధి
మమతల తడి లేని
నా మది ఎడారిలో
ఆలోచనా మాలలు అల్లె
అచంచల ఆత్మవిశ్వాసాల
నా అర్ధాంగి ఆ అరుణ తార..
చీకటి జడత్వంలో దారి దరి
దశ దిశ మృగ్యమైన
ఉజ్జీవములో జీవ
ధామంబై దవన
కాంతులీనిన ధ్రువ తార,
సమ్మిళిత సమస్యల సంద్రాన్ని
చిలికి స్వేదాన్ని చిమ్మి
ఇంట ఆనందాలను ఒంపిన
అమృత ధార...ఆమె!
- కొప్పోలు యాదయ్య
9494273703