Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ ఒక పూల తేరు అది వెన్నెల జలతారు రెండు మనసులొక్కటిగా కలిసి పారు సెలయేరు!!
తొలి వలపొక జడివాన కురిసిందా ఎద లోన పలుకునోయి జీవితాన అనురాగమ్ముల వీణ!!
నిరీక్షణలో నా గుండె నిప్పులాగ మండుతుండె నిరాశలో మునిగి నపుడు కన్నీళ్ళూ ఇంకు తుండె!!
మనసులోన నా రూపం నిలిపిన నీవపురూపం మట్టి ముద్ద ఈ మనిషికి ఇచ్చినావు ఓ రూపం!!
నీ వలపును నాకు పంచి అమృతములో నన్ను ముంచి నా గుండెను చేసినావు నవ రాగమ్ముల విపంచి!!