Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా పెద్దన్నయ్య ఉద్యోగానికి వెళ్తుంటే తనకి క్యారేజ్ అందించడం కోసం అమ్మ చాలా శ్రమ పడాల్సి వచ్చేది. ముఖ్యంగా చలికాలంలో అంత ఉదయానే నిద్రలేచి అన్న కోసం వంట చేసేది. అమ్మ అంత కష్టపడి వండిపెడితే అది పూర్తిగా తినకుండానే ఇంటికి తెచ్చేవాడు. ఏంటి అంటే 'చల్లగా ఉంది ...టెస్ట్ మారిపోయింది' అనేవాడు. అమ్మ బాధపడేది. ముంబయి డబ్బా వాలా గురించి విన్నప్పుడు నేను దానికి త్వరగా కనెక్ట్ కావడానికి కారణం మా అమ్మనే. నా ఆలోచన మా ఇంట్లో చెప్పినప్పుడు అందరి తల్లిదండ్రుల మాదిరిగానే మా అమ్మనాన్న కూడా 'వద్దు ఏదైనా ఉద్యోగం చేసుకో' అన్నారు. కానీ నా ఆలోచన స్టార్టప్ ప్రారంభించాలని. అందుకే వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాను. ఈ ఆలోచన నచ్చిన నా స్నేహితులు మనోజ్, మహదేవ్లు కూడా నాకు అండగా నిలిచారు. మేం ముగ్గురం ఇప్పుడు హైదరాబాద్ డబ్బా వాలాకు ఫౌండర్స్ . మా ఈ ఆలోచన ఎందరో అమ్మల బాధ తీరుస్తుందనే అనుకుంటున్నాం.