Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వద్దన్నా పలకరిస్తూనే ఉంటావు....
రెక్కలు కట్టుకుని వచ్చి
చప్పుడు చేసే
తీపి జ్ఞాపకంలా....
పొమ్మంటే అసలే వెళ్ళవు
ఋణపడి పోయిన
గత జన్మ బాకీలా....
జెండా పాతుక్కూర్చున్నావు
కబ్జా చేసిన రౌడీలా...
ఎక్కడ చూసినా
నువ్వే ఉన్నావు
అద్దంలో నా ప్రతిబింబంలా..