Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూసి ఉన్న నీ కన్నులు తెరచుకోనీ
విరబూసిన నీ నవ్వులు కాంతులీననీ
నీ రూపం కనులారా చూసిన ప్రతి అణువు
దీపానికి జిలుగులనే దిద్దిపోనీ
ఒయ్యారం ఒలికే నీ నడకను చూసి
నదులన్నీ గుణపాఠం నేర్చుకోనీ
ఆశల జాబిల్లులు ఎదలో ఉదయించగా
నీ అందం నింగిలాగ మారిపోనీ
మెరుపులొలికె మెత్తనైన నీ మేనిలో
కమ్మనైన వసంతాలు నడిచిపోనీ
ఆరాధన ఆవేదన ఇకపైన ఎందుకని?
'శరత్ ' లోన నీ రూపం నిలిచిపోనీ
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682