Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసున మనసైన మనవాళ్ళెప్పుడూ
మనతోనే ఉంటారు మనవాళ్ళు కానివాళ్ళెప్పుడూ
మధ్యలోనే మాయమౌతారు
నా చివరి గమ్యం దాకా
నువు తోడు రాలేకపోతే ఏమైంది
కడగళ్ళు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నపుడు
ఊపిరై నిలిచింది నువ్వేకదా.
ఆ ఒక్కటి చాలు
చెలీ! నే బ్రతుకంతా గడిపేయాడానికి
నీ పేరొక్కటి చాలు
నీ నీలికళ్ళ చూపులతో చేసే
ఈ సైగొక్కటి చాలు
నన్ను గెలవడానికి
వేల వేల యుద్ధాలెందుకు నీకు
నా నుండి, నా మనసునే దూరం చేసే
నీ చిరునవ్వొకటి చాలు.