Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ నవ్వులో ఎన్ని పూలపరిమళాలో
ప్రతి చిరునవ్వు ఒక మకరందం
ఆ చూపులో ఎన్ని భావాలో
ప్రతి చూపు ఒక దృశ్యమానం
ఆ మనసులో ఎన్ని నవరసాల్లో
ప్రతి రసం ఒక నవోన్మేషం
ఆ అడుగులో ఎన్ని పాదముద్రలో
ప్రతి ముద్ర ఒక చైతన్యం
ఆ పలుకులో ఎన్ని మకరందాలో
ప్రతి పదం ఒక అమృతం
ఆ నడకలో ఎన్ని వయ్యారాలో
ప్రతి నడక ఒక మయూరం
ఆ మాటలో ఎన్ని తేనేపలుకులో
ప్రతి పలుకు ఒక మకరందం
ఆ ముంగురులో ఎన్ని ఒయ్యారాలో
ప్రతి ఒయ్యారం ఒక సమీరం
ఆ ప్రేమలో ఎన్ని పలవరింతలో
ప్రతి పలవరింపు ఒక పరవశం
ఆ మనిషిలో ఎన్ని ప్రేమభావనలో
ప్రతి భావన ఒక మాధుర్యం
ఆ అనురాగంలో ఎన్ని ప్రేమలో
ప్రతి అనురాగం ఒక ఆత్మీయగంధం
ఆ ముఖంలో ఎన్ని ప్రేమభావనలో
ప్రతి భావనలో ఒక అనురాగం
ఆమె... ఓ ప్రేమైకమూర్తి
ఓ ఆనందానుభూతి
ఓ వర్ణచిత్రం
ఆమె...నా మనసును
నిలువెల్లా దోచిన ప్రేమదొంగ
నన్ను ప్రేమతీరంలోకి
తీసుకెళ్లిన ఆత్మీయ కెరటం
నన్ను నాకే కొత్తగా
పరిచయం చేసిన కొత్త ఊపిరి
నన్ను ప్రేమికుడిగా
మార్చిన సరికొత్త పరిచయం
నన్ను ప్రేమాయణంలోకి
దించిన ప్రేమనాయకి
నా జీవితంలోకి వచ్చిన
జీవనపరిమళం
అవును... ఆమె నా ఊపిరి
నా ప్రాణం నా సమస్తం