Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముషాయిరాలో షహరీలాగ మురిపించావు
గజళ్లలోని మిస్రాలాగ ఉదయించావు
చమేలీ నవ్వుల కన్నులలోన వెన్నెలలొలికించి
పెదవులలోని ఖజానాలో నన్నే దాచావు
గులాబి సొగసుల గుబాళింపులు నీలో మెరిపించి
బహార్ లాగా పసందు చేసి మైమరపించావు
వెచ్చనైన నీ మేని తళుకులో కోరికలూరించి
కురుల నలుపుల దారులలోన నన్నే నిలిపావు
నీ మాటకు సాటిగ మధువే రాక చిన్నబోయింది
ఆ మధువుకు తీయందనాలనూ మరి నువ్వే ఇచ్చావు
హుషారుగా ఈ జగత్తునంతా ఊయలలూగించి
'శరత్ ' మనసులో మమతవు నీవై నిండిపోయావు.
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682