Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ కన్నులలోన వెన్నెలవాన కురిసింది
నీ దరహాసంలో పారిజాతమే విరిసింది
నీ రాకలోన చిరుగాలులెన్నో కదలాడుచున్నాయి
నీ చూపులోన జాబిల్లి పుష్పాలు విరబూయుచున్నాయి
కమ్మని నీ మది చిమ్మెను కౌముది నెమ్మది నెమ్మదిగా
జుమ్మని పాడెను తుమ్మెద మాదిరి కమ్మని గీతికగా
నీ మాటలందు తేనెల వాకలు ప్రవహించుచున్నాయి
నీ నడకలందు
రాయంచజాడలు కనిపించుచున్నాయి
నీలోని ఊహల
ఉయ్యాలలోన మైమరచి నిదురించగా
నాలోని కవనాల
పవనాలు చెలరేగి సుధలెన్నో చిందించగా
- తిరునగరి శ్రీనివాసస్వామి,
9440369939