Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత మంది టీనేజర్లలో గడ్డం త్వరగా రాదు. వచ్చినా సరిగా రాదు. దీంతో గడ్డం పూర్తిగా వస్తే బాగుండని లోలోనే మథన పడుతుంటారు. గడ్డం త్వరగా రావాలని కొందరైతే రేజర్లతో షేవ్ చేసుకుంటుంటారు. కానీ ఇలా షేవ్ చేసుకోవడం వల్ల ఫలితం ఉండదు. దాంతో గడ్డం పెంచుకునే వాళ్లను చూసి బాధపడుతుంటారు. హార్మోన్ల ప్రభావం కారణంగా కొందరిలో గడ్డం రావడం ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం గడ్డం అనేది స్టయిల్‌కు సంబంధించిన అంశంగా మారిపోయింది. అందుకే తమకు కూడా తొందరగా గడ్డం వస్తే బాగుండని టీనేజర్లు భావిస్తుంటారు . మరి గడ్డం తొందరగా రావాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుందాం...
చేయకూడదనిది
-షేవింగ్ చేయడం వల్ల గడ్డం వస్తుందనుకోవడం సరికాదు. ముఖంపై వెంట్రుకలు సరిగా రాక ముందే షేవింగ్, ట్రిమ్మింగ్ చేయడం వల్ల ముఖం గరుకుగా మారుతుంది. కాబట్టి ఈ పనులు మానుకోవాలి.
చేయవల్సింది
- యూకలిఫ్టస్ నూనెను ఆలివ్ నూనెతో లేదా నువ్వుల నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మసాజ్ చేసుకొని 20 నిమిషాలు ఆగి చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
- రోజ్ బేరీ నూనెలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి గడ్డంపై రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
- నిమ్మరసంతోనూ గడ్డం వేగంగా వచ్చేలా చేయవచ్చు. రెండు స్పూన్ల నిమ్మరసాన్ని ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిలో కలిపి గడ్డం రాసుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం, ప్రశాంతంగా నిద్రించడంతోపాటు ఒత్తిడికి గురికాకూడదు. పోషకాహారం తీసుకుంటూ.. రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగడమనేది గడ్డం త్వరగా రావడానికే కాదు.. ఆరోగ్యపరంగా మంచిది.
- ఆవాల ఆకులను పేస్టులా చేసి ఉసిరి నూనెతో కలిపి గడ్డానికి పట్టించాలి. తర్వాత నీటితో కడిగేయడం వల్ల గడ్డం వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి.