Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరవిరిసే నీ ముఖారవిందాన్ని
నిత్యం చూడనిదే
నా మనసుకు వసంతరాగపు ఉషోదయమెక్కడిది
ప్రేమంటే ఎదురుచూపులతో
సాగే ఒక పలవరింత
నిత్యం మెరుపులా మెరిసే
నీ కన్నులను చూడనిదే
నా కళ్ళల్లో అందమైన
అనురాగ ప్రేమకాంతి ఎక్కడిది
ప్రేమంటే జీవితంలో
చల్లని వెన్నెలను పంచే జాబిల్లి
కమనీయమైన నీ కమ్మని
పలుకులను రోజూ నిననిదే
నా హృదయంలో శృతిలయల
సరాగపు స్వరమెక్కడిది
ప్రేమంటే రెండు హృదయాలను
ఏకం చేసే ఐక్యతారాగం
నాజూకుగా నడిచే నీ పాదారవిందాల
దర్శనం కానిదే
నాకు సుప్రభాతపు సుస్వరాల
వేకువ గానమెక్కడిది
ప్రేమంటే ఎదకోవెలలో
పూజించే దేవతా నీరాజనం
గలగలలా నవ్వే నీ చిరునవ్వులను ఆస్వాదించనిదే
నా మనసుకు ఉషోదయపు మానసోల్లాసమెక్కడిది
ప్రేమంటే మనసులనుకలిపేసే
ఒక అనురాగ బంధం