Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ ఊహ చాలు...
నీ ఊహ నాకు తోడుంటే చాలు...
ఆకాశమంత ఊపిరిని
నా ఉత్సాహంగా పీల్చుకుంటా...!
రవికిరణాలనూ, చంద్రకిరణాలనూ
సమపాళ్ళలో మేళవించుకున్న
నీ కళ్ళ సముజ్జ్వల కాంతులలో
చీకట్ల కష్టాలకడలుల నెన్నింటినైనా
చాలా అవలీలగా ఈదేస్తా...!
నీ పెదవుల అంచులపై
ఆమని పలుకరింతగా,
నా మది పులకరింతగా పూచే
నీ సుందరదరహాసాల ప్రేరణల
ప్రోత్సాహామృతంలో
నా మనసు కలాన్ని ముంచి
కవిత లెన్నెన్నో వ్రాసేస్తా...!!!
- రఘువర్మ,
9290093933