Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నుల్లోనుంచి ఒకానొక
ఉచితపు చూపు
నీలిరంగునద్దుకున్న
కనురెప్పల గూగుల్ కు
తాకించిన గుండె మౌస్..
ఆ చూపుల విండోస్లోకెళ్ళినప్పుడల్లా
హార్ట్ బీట్ ను ఊహల్లో ముంచి
ఉక్కిరి బిక్కిరి చేసిన రోజులు
తెల్లని నురుగుపూల కన్నుల్లో నుంచి
కాలర్ ట్యూన్స్..
పురుగై కుట్టిన కన్నుపాటను
ట్యూన్ చేస్తున్న రెప్పలు
అరకన్ను గదిలో
షట్ డౌన్,లాగిన్ లా రెప్పల మోతలు
కన్నుల్లో నింపుకున్న డెస్క్ టాప్ నుంచి
నేరుగా చూపుల రంగు కాగితాలు
నీలిరంగు పదనిసలు
ఆకాశపు తెరపైన
నల్లనిచంద్రబింబం హీరోయిన్
మదిని మీటుతున్న రెప్పల పియానో
విశాలమైన కన్ను ప్రాంగణంలో
ప్రేమకథా చిత్రం
అరవిరిసిన కన్నుల
ఆశావాహ దృక్పథం రెప్పల సంగీతం
-తండ హరీష్ గౌడ్,
8978439551