Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా పాటకు ప్రాణం నీవే
నా మాటకు నాదం నీవే
నా ఎదసవ్వడిలో వినిపించే
అనురాగం నీవే నీవే
తూరుపు దిశకే అలంకారమౌ
సూర్యోదయము నీవే
రాతిరమ్మ సిగలోన విరిసిన
జాబిలమ్మవు నీవే
ఆకాశంలో మిలమిల మెరిసే
ప్రతి నక్షత్రం నీవే
ఋతువులన్నిటికి మహారాణియౌ
వసంతానివి నీవే
వసంతానికి ప్రాణం పోసే
కోయిలగానం నీవే
ప్రకృతిలోని ప్రతి అణువు అణువులో
పల్లవించునది నీవే.
నా వదనమ్మున కదులుతున్న చిరు
నవ్వుల కిరణం నీవే
నా కన్నులలో ప్రతిబింబించే
వెన్నెల దీపం నీవే
నా జీవనవాహిని నీవే
నా భావనరూపిణి నీవే
- తిరునగరి శ్రీనివాసస్వామి,
440369939