Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ గాలి మోసిన పరిమళంలో
ఏవో కొత్త ఊసులు!
ఈ దారి కొమ్మల పూలల్లో
అన్ని కొత్త రంగులు!
ఈ నేల తాకిన పాదముద్రల
కోమలత్వపు పరిచయాలు!
నీ మెని తాకిన గాలి
పూలతో చెప్పిన ఊసులకి
అవి కొత్త వర్ణాలద్దుకున్నారు!
ఈ నెల నడచిన కోమలి
నీ మాటవిని పరవశంతో
కోయిల తన పాట మరచింది!
నీ రాకతో సృష్టి
స్తంభించిపోయే మాయలు!
అంతా కొత్తదనపు
ఛాయలు!
- నాగ్రాజ్,
9440339098