Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువు కనిపించినప్పుడల్లా
తీయని స్వరమై సాగిపోతాను
సరిగమలూరే పాటనై నిలిచిపోతాను
ఎప్పుడూ లేని
ఆనందం నాలో పరవళ్ళు తొక్కుతున్న ఈ రేయిలో
హాయిలో నిండిపోయిన లేతజాబిలినై విరిసిపోతాను
నీ కోసం ప్రేమాక్షరాలు నిండిన
కావ్యమై కదిలిపోతాను
రేయి పగలు అనే తేడా లేదు
కష్టం సుఖం అనే భేదం లేదు
ఆకలి నిద్ర అనేదసలే లేదు
నీవు అనేదే ఉంటే నాకిక ఏ చింతా లేదు.
అణువణువు నీ ప్రేమమయమైన వేళ
నరకమైనా స్వర్గమై నను
నడిపిస్తుంది.గెలిపిస్తుంది.
నీ స్వరాల వరాల కోసం
ఎదురుచూస్తూనే ఉన్నాను
చూసిన ప్రకృతినంతా
కవితగా రాసేస్తున్నాను.
రాసిన కవితలో
ప్రతి అక్షరమూ,ప్రతి భావమూ నీవై నిలబడిన వేళ
తన్మయత్వంతో తరలిపోతాను.
ప్రేమైన నీవు
నా ముందు నిలబడి
నీ మనసు తెరిచి నన్ను పిలిచినవేళ
నీవైన నేను నేనై పోతాను
నీవైన నేను నేనై పోతాను.
- తిరునగరి శరత్ చంద్ర, 6309873682