Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా చెమట పట్టని మనిషంటూ ఉండరు. ఇంచుమించు అన్ని ప్రదేశాలలోనూ అందరికీ చెమట పడుతుంది. శరీరాన్ని చర్మం తనంత తాను చల్లబరిచే సహజసిద్ధమైన ప్రక్రియే చెమట పట్టడం. శీతల ప్రాంతాలలో నివసించేవారికి ఉష్ణమండలంలో నివసించేవారికన్నా తక్కువగా చెమటపట్టడం సహజం. హిమాలయాలంటే అత్యంత చల్లగా ఉండే ప్రదేశం కదా! అక్కడ నివసించే వారికి చెమట పట్టదేమోనని అనుకుంటాం. అయితే హిమాలయాలలో నివసించేవారికి కూడా చెమటపడుతుంది. కారణం క్షీరదాల జాతికి చెందిన వారందరికీ స్వేద గ్రంథులు తప్పకుండా ఉంటాయి. హిమాలయాలలో నివసించేవారికీ స్వేదగ్రంథులుంటాయి. కాబట్టి వారికీ చెమటపడుతుంది. అయితే అక్కడివారికి చెమట పోసిన వెంటనే అది గాలిలో కలిసిపోతుంటుంది. అందువల్ల అది బయటకు కనిపించదు.