Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ కన్నులు వెన్నెల దీపాలు
నీ చూపులు మెత్తని బాణాలు
నీ మనసున పొంగిన భావాలు
మధురాతి మధురాలు
నీ మాటలు మధుర ప్రబంధాలు
మరపించే రసవత్కావ్యాలు
నీ భావతరంగ మృదంగాలు
విహరించే కవనవిహంగాలు
నీ కమ్మని హృదయ మకరందాలు
వికసించే కుసుమ విలాసాలు
నీ తీయని గొంతున రాగాలు
మకరందఝరీ మృదు గీతాలు
నీ సుందర మందగమనాలు
రాయంచలకే ఆదర్శాలు
నీ పదమంజీర నినాదాలు
సంగీత లయ విన్యాసాలు
- తిరునగరి శ్రీనివాసస్వామి
సెల్ . 9440369939