Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలవంక విరిసిన రోజు
ఆ నవ్వులో
ఏరుకున్న ముత్యాలు
దోసిట పట్టుకు తిరుగుతున్నా!
ఎన్నిపున్నములు తరలిపోయాయో
మళ్ళీ ఆ నవ్వు విరియలేదు
అదిగో అక్కడ నింగిలో
తార మెరిసిపోతుంటే
పిలిచి దోసిట ముత్యాలు
చూపించాను!
నిండుపున్నమిలా మారి
నెలవంకలా భళ్ళున నవ్వింది
నవ్వుల్లో కురిసిన ముత్యాలు
ఏరుకుందామని వంగే లోపు
తారల్లో చేరి మాయమైంది!
ఏరుకున్న ముత్యాలు
గుండెసంచిలో వేసుకుని
నెలవంక కోసం వెతుకుతున్న
అమావాస్యనై!
- వి . నాగరాజు,
9440339098