Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిమళాల పూదోటవై విరబూస్తూ
వికసిత పద్మసోయగమై అలరిస్తూ
ఆనందాల సయ్యాటలు ఆడేస్తూ
నీ సుందరరూపం చూసి పులకిస్తూ
నీ లావణ్య సొగసులకు ముగ్ధుడనై
ఆనంద సమ్మేళనమైనది నా మది!
అలకలు మాని కౌగిలిదరిచేరిపో!
స్వేచ్చా విహంగాలై ఎగిరిపోదాం!
ఇరువురం ఏకమై సంతోషాలు పూయిద్దాం!
ఇకమీదట సంతసపు రోజులను స్వాగతిద్దాం!
ఇంద్రధనస్సు రంగులద్ది
జీవనపయనం సాగిద్దాం!!
- నిక్కూ
9581214744