Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీవలా కదలి వస్తుంటే
వయ్యారాలన్నీ వాలిపోయి
వీచే గాలి సైతం మదిలో
వలపులు ఒలకబోస్తుంది!
నీవలా నన్నొదిలి వెళ్తుంటే
ఎదలో తీగలు తెగిపోయి
మానసవీణ మూగబోయి
దిగులుజల్లు కురుస్తుంది!
నీవలా నవ్వుతుంటే
చీకటి నిండిన జీవితంలో
వెన్నెలపువ్వులు పూసి
వెలుగుపరిమళం సోకుతుంది!
కదిలే మేఘవర్ణమై
కన్నులకు చల్లదనాన్నిస్తూ,
ఓరకంటతో అలకను చూపితే
మోహపు కెరటాలతో
విరహసముద్రాలను ఈదేస్తాను!
అందానికే అందని అందం
చూసే చూపుకే అందే గంధం,
ప్రాణమున్న శిల్పవిన్యాసం
రాళ్ళను కదిలించే రసరమ్యం!
- పుట్టి గిరిధర్
9491493170