Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డౌన్లోడ్ చేసుకోవచ్చు
భార్య: ఏమండీ... ఇంటర్నెట్లో ఏం దొరుకుతుంది?
భర్త: నీకు కావాల్సింది ఏదైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
భార్య: ఏవైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చా..? అయితే నేను పిడకలు చేయాలనుకుంటున్నా. కాస్త పేడ డౌన్ లోడ్ చేసిస్తారా...
మర్చిపోయా...
ఓ 80 ఏళ్ల పెద్దాయనను కొత్తగా పెళ్లయిన పొరిగింటి యువకుడు ఇలా అడిగాడు..
యువకుడు: మీకు పెండ్లయి 60 ఏండ్లు అవుతుంది. అయినా మీ భార్యను డార్లింగ్, ప్రియా, డియర్ అని పిలుస్తున్నారు. అది మీకెలా సాధ్యమైంది?
తాత: 20 ఏండ్ల కిందట నా భార్య పేరు మర్చిపోయా.. అడగాలంటే భయమేసి ఇలా పిలుస్తున్నానంతే..