Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్ళు మూసుకుంటే
కొన్ని క్షణాలు పరిమళిస్తుంటాయి
రెప్పలపై సాంభ్రాణి
ధూపమేసినట్లు మత్తుగా....
పుట్టతేనెలా చుక్కలు చుక్కలుగా
జారుతుంటాయి కొన్ని జ్ఞాపకాలు
మంచులో తడిసిన గువ్వలా
నవ్వుతుంది నా మనసపుడు...
కరిగిన మౌనం
మాటయ్యే వేళ...
మనసులోని వర్షం
అక్షరమవుతుంది....
కొన్ని పెదవులపై
నవ్వులు పూయిస్తే
కొన్ని కన్నుల్లో
సంద్రాలవుతుంటాయి....
గుండె కింద
వెన్నెల తరకల సవ్వడి
కన్నుల్లో
మేఘమాలల లాహిరి...
ఎందుకో...
జారే కన్నీటికిపుడు
నీ పేరే పెట్టాలనిపిస్తుంది...