Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విధి నన్ను చూసి వెక్కిరిస్తోంది
నీకై నే నిర్మించుకున్న ఆశా సౌదాన్ని
పునాధుల్లేకుండా కూల్చేశాననీ...
గడ్డిపరకలు సైతం
గలగలమంటూ నవ్వేస్తున్నారు
కడసారి వదిలి వెళ్లిన నీ అడుగుల
గుర్తుల్ని చీల్చేస్తూ మొలకెత్తామనీ...
కాలం విర్రవీగుతోంది
మనిద్దరి మధ్య ఎడబాటును
ఒక జీవిత కాలం పెంచేశాననీ...
పాపం వాటికేం తెలుసు
నా ఊహల్లో నువ్వున్నావనీ...
నా ఉపిరిలో దాగున్నావనీ...
పాపం వాటికేం తెలుసు?
నా కనుకొలనులో
సుమమై విరబూస్తున్నావనీ...
నా హృది కోవెలలో
ప్రమిదవై ప్రకాశిస్తున్నావనీ...
పాపం వాటికేం తెలుసు?
- కోడిగూటి తిరుపతి
9573929493