Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకసారి
నీ పేరు
తలచుకుంటే చాలు
మనసు వెన్నవుతుంది
మాట మూగవుతుంది
ఎందుకో తెలీదు ...
ఒకసారి
నీ ప్రేమ స్పురణకొస్తే చాలు
గుండె గుడి అవుతుంది
శ్వాస జపమౌతుంది
ఎందుకో తెలీదు...
ఒకసారి
నీసన్నిధి అనుకుంటేచాలు
గడియ గంటవుతుంది
క్షణము యుగమవుతుంది
ఎందుకో తెలీదు...
ఒకసారి
నీ అలక గుర్తొస్తే చాలు
స్పందన ఆగిపోతుంది
వేదన కమ్మేస్తుంది
ఎందుకో తెలీదు.........! !
ఒకసారి
నీ గోముమననమైతే చాలు
చచ్చిపోవాలనిపిస్తోంది
తిరిగి పుట్టాలనిపిస్తోంది
ఎందుకో తెలీదు...
ఒకసారి
నీ మూర్ఖం జ్ఞప్తికొస్తేచాలు
ఒళ్ళు మండి పోతోంది
జాలి జాగృతమవుతోంది
ఎందుకో తెలీదు...
ఒకసారి
నువ్వు ఉమ్మివేసినా సరే
తుడుచుకోవాలనిపిస్తోంది
మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తోంది
ఎందుకో తెలీదు...
ఒకసారి
ఎన్నాళ్ళైనా నీరాక కోసం
చూడలనిపిస్తోంది
ప్రేమ ఇంకా మిగిలి వుందని
చెప్పాలనిపిస్తోంది
- రమాదేవి కులకర్ణి
8985613123