Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిరి పలుకుల చినుకులు
కురిసేదెప్పుడో...
చిరు నవ్వుల సవ్వడి
మోగేదెప్పుడో...
మధుర స్వర సందడి
వినిపించేదెపుడో
సుకుమార ముగ్ద రూపం
అరి విరిసేదెపుడో
మనసున భావనలు
విప్పి చెప్పేదెపుడో
తనువుల తపనలు
తీరేదెప్పుడో
ఊహలు నిజమై
కళ్లెదురుగా నిలిచేదెప్పుడో...
మనస్సులు ఏకమై
ఏడడుగులు నడిచేదెప్పుడో...
ప్రియతమా!
మది తలుపులు తెరిచి
ఆ మధుర క్షణాలకై నిరీక్షిస్తున్నా...
- కోడిగూటి తిరుపతి
9573929493