Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిత్రురాళ్ళతో కలిసి వాళ్ళ మాటల్లో
నీ మధురమైన మాటలవీణలను మ్రోగిస్తూ
సెలయేరువలె గలగలా నవ్వుతూ వస్తూ
నన్ను చూడగానే మౌనమందాకినివై,
ప్రేమ కావ్య పీఠికగా కళ్ళతోనే పలుకరిస్తూ
నీకు ఆ ప్రక్కా,ఈ ప్రక్కా మేళమాడే
ఆ కలకంఠినుల తీయని స్వరాలను సైతం
''ష్'' నిశ్శబ్దం అంటూ ప్రశాసిస్తూ
తిరిగి చూస్తూ హంసగమనవై వెళ్ళిపోతావు!
మరునాడే...కావాలని దారిలో నా కెదురొచ్చి
చూసీచూడకుండా ''అంజాన్'' కొడుతూ పోతూ
నా సున్నితమైన మనసును మెలిపెడుతావు!
సహననికషను పెట్టి నన్ను నెగ్గిస్తావు!
ఆ మరునాడే...నా సమీపానికి దయచేసి
మళ్ళీ కావాలని నన్నుదాటి వెళ్ళి
ఆ ప్రక్కన ఉన్నవారితో నాకు విన్పించేటట్లు
నేను ఉడుక్కునే విధంగా మాట్లాడుతూ
నా గుండెలో మంటలు రగిలించి వెళ్తావు!
నీ పట్ల నా కున్న ప్రేమకు పుటం పెడుతావు!
నా మదినే గీటురాయిగా చేసి
ఎప్పటికప్పుడు నా ప్రేమను పరీక్షిస్తూ
నన్ను నికార్సైన ప్రేమికుడిగా
నిలబెడుతూంటావు నీరజాననా...!!!
- రఘువర్మ
9290093933.