Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితమంటేనే ఒడిదుడుకులమయం.' కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలమేమో గానీ, కండ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం' అనే నానుడి ఉండనే ఉంది. వెలుగులు, చీకట్లు దాగుడుమూతలు ఆడుతుంటాయి. మనిషన్నాక ఇవి సర్వసాధారణం. వెలుగులను చూసి మురిసిపోవద్దు. చీకట్లను చూసి చింతచెందుదొద్దు. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదని మనస్తాపం చెందడం కన్నా మనలో ఎంత చిత్తశుద్ధి ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. లక్ష్యం సరైనదే అయితే విజయం తప్పనిసరిగా వరిస్తుందని అంటున్నారు నిపుణులు.
జీవితమంటేనే ఒడుదుడుకులమయం.' కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలమేమో గానీ, కండ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం' అనే నానుడి ఉండనే ఉంది. వెలుగులు, చీకట్లు దాగుడుమూతలు ఆడుతుంటాయి. మనిషన్నాక ఇవి సర్వసాధారణం. వెలుగులను చూసి మురిసిపోవద్దు. చీకట్లను చూసి చింతచెందుదొద్దు. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదని మనస్తాపం చెందడం కన్నా మనలో ఎంత చిత్తశుద్ధి ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. లక్ష్యం సరైనదే అయితే విజయం తప్పనిసరిగా వరిస్తుందని అంటున్నారు నిపుణులు.
కాస్త కష్టం రాగానే చాలా కంగారు పడిపోతుంటాం. అయితే జీవితంలో చీకట్లు అలుముకున్నాయని ఆందోళన చెందడంలో అర్థం లేదు. అలుపెరుగని కృషితో సమస్యలను అధిగమించేవారు నిజమైన హీరోలు. లక్ష్యం లేకుంటే విజయం అసాధ్యం.
రేపటి గురించి ఆలోచించండి
సుఖమయ జీవితాన్ని పొందాలంటే అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. బద్దకిస్తే విలువైన సమయం వృథాగా గడిచిపోతుంది. 'బద్దకస్తుడి మనసు భూతాల నిలయం' అనే సామెత మమ్మూటికి నిజం. నిన్నటిని మరచిపోండి. రేపటి గురించి ఆలోచించండి. ఇప్పటి వరకు వ్యర్థంగా గడిచిపోయిన కాలాన్ని మరచిపోండి. ఇకనైనా కార్యాచరణలోకి అడుగుపెట్టండి. మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక లక్ష్యాన్ని జీవితానికి ఒక ఉద్దేశాన్ని నిర్దేశించుకోండి. రోజూ ఒక మంచి పని చేయండి. కానీ ఏ పనీ చేయకుండా ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. అసంతృప్తి జీవులుగా మిగిలిపోతారు జాగ్రత్త.
వాస్తవ పరిస్థితులను గమనించి
మనిషన్నాక ఇంటా బయటా ఏదో సమస్యలు, అవరోధాలు ఉంటూనే ఉంటాయి. పరిస్థితులు ఒకరి అదుపాజ్ఞలను బట్టిరావు. తాము ఉండే చోట గల వాస్తవ పరిస్థితిని గమనించి తదనుగుణంగా వ్యవహరించగలిగినప్పుడే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు. పరిస్థితులు బాగాలేవని తిట్టుకుంటూ కూర్చుంటే చివరకు ఎందుకూ పనికి రాని వారిగా, అసంతృప్తి జీవులుగా మిగిలిపోతారు.
సంకల్పం అవసరం
జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ప్రతిఒక్కరిలోనూ ఉండాలి. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనే సంకల్పం అవసరం. ఇతరుల మీద ఆధారపడకుండా సొంత ప్రణాళికలతో జీవన విధానాన్ని కొనసాగించాలి. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను నిర్వహించుకుని ఒక మంచి కెరీర్‌ని నిర్మించుకోవడానికి ఎన్ని కష్టాలను ఎదుర్కోవడానికైనా సిద్ధపడాలి. ముందుగానే అన్ని విషయాల గురించి ఆలోచించుకుని, సమయానుకులంగా ముందడుగు వేస్తూ... విజయాలవైపు ముందుకు సాగిపోవాలి.
అవగాహన పెంచుకోవాలి
కెరీర్ గురించి ఆలోచించకుండా సామాన్య జీవితాన్ని గడపడం సరికాదు. ఏ సమయంలో ఎటువంటి అడుగు వేయాలి... ఎటువంటి ప్రణాళికలు మన జీవితానికి తోడ్పడుతాయి..? అనే విషయాల గురించి అవగాహన పెంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తీరని నష్టాన్ని కొనితెచ్చుకోవద్దు. ఇతరులు చెప్పిన విధంగా నడుచుకోకుండా మీకు మీరుగానే ఉండండి. మీరు నిర్దేశించుకున్న బాటలోనే ముందుకు నడవడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న ఇష్టాలు, కోరికల గురించి ఈ జగత్తులోనే మరెవ్వరికీ తెలియదు. వాటికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణకు, కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే మీరు కోరుకున్న జీవితాన్ని, కెరీర్‌ను మలుచుకోగలుగుతారు.
ప్లానింగ్ ఉండాల్సిందే
మీకు ఏం చేస్తే నచ్చుతుందో... ఎలాంటి ఉద్యోగం, వృత్తి చేపడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో... ఏ పని అయితే ఎక్కువ శ్రమ అనిపించదో... ముందుగా అటువంటి విషయాల గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి! మీకు నచ్చిందో ఏదో కూడా మీరు తెలుసుకోలేకపోతే చాలా కష్టం. అందుకే ముందుగా మీకు ఎక్కువగా నచ్చే విషయాల గురించి ఒక పట్టికను రాసి పెట్టుకోండి. వాటి గురించే నిత్యం ఆలోచించడం మొదలుపెట్టుకోండి. అందులో మరీ ముఖ్యమైనవి ఏవో ఏకాగ్రతతతో గమనించండి. అప్పుడే మీరు మీలో ఉన్న నైపుణ్యత, సామర్థ్యతను తెలుసుకోగలరు. దాని ద్వారా మీకు నచ్చే ఉద్యోగం గానీ, పనిగానీ, భవిష్యత్ ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం గానీ జరుగుతుంది.
నిత్యం గుర్తు చేసుకుంటూ
మీరు ఏం చేయాలనుకుంటున్నారోననే విషయం మీకు అవగాహన వచ్చినప్పుడు దానినే మనసులో పదిల పరుచుకోవాలి. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు పదిలం చేసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు గర్తు చేసుకుంటూ దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాని గురించే ఆలోచించుకోవాలి. అలా కాకుండా తరచూ నిర్ణయాలను మార్చుకుంటూ పోతే... సమయం వృధా అవడమే కాకుండా కెరీర్ పరంగా అవకతవకలు ఎదురవుతాయి.
బలమైన నిర్ణయంతో...
మీరు ఎలాంటి వృత్తిని కోరుకుంటున్నారో దాని గమ్యాన్నే చేరుకోవాలనే ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. దానికి మాత్రమే కట్టుబడి ఉండే విధంగా ప్రయత్నించాలి. ఒకవేళ మీరు ఎంచుకున్న నిర్ణయంలో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వాటి గురించి మీ బంధుమిత్రులు, సన్నిహితులతో కలిసి చర్చించండి. ఇది మీకు చాలా మంచిది. అప్పుడు అందులో ఉన్న లోపాలు, కష్టాలు, నస్టాల గురించి తెలుసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తే విజయం మీ సొంతమవుతుంది.