Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట లోన పల్లవివై
తోట లోన మల్లికవై
పున్నమిలో వెన్నెలవై
వెన్నెలలో పున్నమివై
కనిపించే నా కవితవు నీవే...
నినదించే నా గుండియ నీవే...
నా హృదయంలో కురిసిన
ఆ వెన్నెల వాన నీవు
నా వదనంలో మెరిసిన
చిరునవ్వుల వీణ నీవు
నా జీవన మందాకిని నీవే...
నా భావన బృందావని నీవే...
నా ఎద ముంగిలి లోపల
ఒదిగిన సంక్రాంతి నీవు
నా పద వారాశి లోని
ఆ సంధ్యాకాంతి నీవు
మంజుల వాగ్విలాసినివి నీవే...
సుందర చిద్విలాసినివి నీవే...
- తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939