Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీరింకిన కండ్లను చూసైనా
కరగలేదా శిలవంటి నీ మది
ఎరుపెక్కిన బుగ్గల్లో రగుతం చేరి
కందిపోయినా కనికరించలేదే..
అడుగులు తడబడుతున్నా
పలుకులు శృతితప్పుతున్నా
గమనం గతి తప్పుతున్నా
నేనున్నానని చేయందించలేదే...
చేతుల్లో చేతులేసుకోని
చేసుకున్న బాసలన్నీ
కళ్లలో కళ్లెట్టి చూసుకుంటూ
దిద్దుకున్న అక్షరాలన్నీ అబద్దమేనా..
హఠాత్తుగా రాలిపోయిన ఉల్కవలె
గగనమంతా వెలుగులీనుతూ
భువిని సమీపించు సమయాన
మసైన చందమామే మన ప్రణయం...
నిర్దయగా నీవు నన్ను వీడిపోయినా
నీతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ
నీవు అందించిన స్మృతుల్ని యాది చేసుకుంటూ
కాలం గడిపేస్తున్నానిలా దారి మరిచిన బాటసారిలా...
- యస్.వినోద్ కుమార్,
9908312949,
వరంగల్