Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల వెంట్రుక తెచ్చిస్తే...
డిగ్రీ చదువుతున్న రాణిని వెంకట్ రెండేండ్లుగా ప్రేమిస్తున్నాడు..
ఒకరోజు రాణి తమ్ముడు బంటిని కలిశాడు వెంకట్..
వెంకట్: మీ అక్క జడ చూసి ఆమెను ప్రేమించా. ఆమె తల వెంట్రుక ఒక్కటి తెచ్చిస్తే నీకు చాక్లెట్ ఇస్తాను అన్నాడు..
బంటి: 'డబ్బా చాక్లెట్స్ కొనిస్తానంటే అక్క జడ సవరం మొత్తమే తెచ్చిస్తాను' ఆత్రుతగా అడిగాడు..
రఫాడిస్తుందండీ...
అప్పుడే ఇంటికి వచ్చిన సుందరం భార్యను గమనించాడు..
సుందరం: నువ్వు ఇల్లు ఊడుస్తున్నావేంటి. ఈ రోజు పని మనిషి రాలేదా?
పంకజం: 'అది వచ్చి చూసిందంటే ఇంకేమైనా ఉందా. ఇల్లు ఇంత మట్టి మట్టి ఎలా చేశారంటూ రఫాడిస్తుందండీ. అందుకే గొడవ ఎందుకని నేనే ఊడుస్తున్నాను' భయపడుతూ చెప్పింది...
పోటీ చేయొద్దు...
ఎన్నికల ప్రచారంలో ఓ రాజకీయ నాయకుడు పాల్గొన్నాడు...
పార్టీ నేత: మొదటిసారి గెలిచినప్పుడు నా కోసం ఎన్నో చేసుకున్నాను. ఇప్పుడు కేవలం ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. మీరే చెప్పండి నేనేం చేయాలో ?
ప్రజలు: ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే చాలు బాబు...