Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్ళు మౌనంగా సంభాషిస్తూ...
మాటల్లో చెప్పలేని భావాలను
అందంగా పలికించగల వు
జిలుగు వెలుగుల ను పంచుతూ...
కలల పంటలు పండిం చగలవు
చిలిపిగ నవ్వుతూ...
ఓర చూపుల బాణాలను
నేరుగా గుండెల్లో దింప గలవు
ప్రేమ వంతెనలు కట్టేసుకుని...
హృదయ మంతా నిండగలవు
రహస్యంగా మంతనాలు జరుపుతూ....
గొప్ప మంత్రాగాన్ని నడపగలవు
ఆనందం లో చూపుల పండు వెన్నెల్ని....
విషాదంలో ఎడారుల నైరాశ్యాన్ని
చూపగలవు
ప్రమో దాన్ని...విషాదాన్ని...
ఆశను...నిరాశను తమలో నింపు కోగలవు
జీవితపు పత్రం మీది
విరహ పు మరకల్ని...
కనిపించ కుండా దాచగలవు
మనసులో జ్ఞాపకాల వెల్లువ
అల్ల కల్లోలం సృష్టిస్తున్నా....
జీవితపు కన్నీటి గాథలు...
కన్నీ రై ప్రవహిం చవు
ఎందుకంటే....
రెప్ప చాటున ఉప్పెనను
కళ్ళు మాత్రమే ఆపగలవు...
మోదం వెనుక నున్న ఖేదాన్ని
కొందరి కళ్ళే చూడగలవు
- కలల కౌముది
9490235017