Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనిపించని నీ ఆనవాళ్ళను
కనుచూపుమేర వెతుకుతునే ఉన్నాయి
నా కళ్ళిపుడు...
నేస్తమా..!
ఎదురు చూపుల్లో
ఆనందాలే కాదు....
కరిగి పోతున్న
కన్నీళ్ళు కూడా ఉంటాయి....!
అవి...
సడి సేయని చినుకులై
మనసును తడుపుతూ...
ఎదలోని జ్ఞాపకాలను
తట్టిలేపుతుంటాయి....!
ఆ సవ్వడులు నాకైతే
వినిపిస్తున్నాయి....
మరి నీకెందుకు వినిపించడం లేదు
ఓ..నా..హృదయమా..!!
- శాంతి కృష్ణ,
9502236670