Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాగతం పలికి
వందనాలు చేస్తూ
మువ్వన్నెల కేతనం ఎగరవేయాలని
ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాం గానీ
గణతంత్ర దినోత్సవమంటే
మన రాజ్యాంగాన్ని
అమలు పరుచుకున్న
విలువైన రోజని మనలో
ఎంతమందికి తెలుసు?
దేశాన్ని కాపాడుదాం
అమరుల త్యాగాలను గుర్తిద్దాం
జెండాలోని ప్రతి రంగు
ప్రత్యేకతను తెలుసుకుందాం
అశోక చక్రం అందించే
సందేశాన్ని స్వీకరిద్దాం!
అవినీతిని అంతానికి
చేయీ చేయీ కలుపుదాం
కులమత భేదాలకు
స్వస్తి వాచకం పలుకుదాం
గాంధీ ఆశయాల సాధనకై
ఐక్యంగా నిలబడుదాం
అంబేద్కర్ అందించిన
రాజ్యాంగ ఔన్నత్యాన్ని
కాపాడుకోవడానికి మనమంతా
ప్రతిన పూనుదాం!
ఈ గణతంత్ర దినోత్సవం వేళ
మానవీయ విలువల కోసం
గొంతెత్తి నినదిద్దాం
అడుగడుగునా జరుగుతున్న
అన్యాయాలను ఎదురిద్దాం!
స్త్రీలను గౌరవించి
వారి రక్షణ కోసం
మనం బాధ్యత తీసుకుందాం!
మహిళల వదనాల్లో
చిరునవ్వులు పూయిద్దాం!
అపుడే మన త్రివర్ణ పతాకం
గగన వీధిన గర్వంగా
రెవరెప లాడుతుంది!
- అనిత దావత్,
9394221927