Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలుకు రాక పలక లేక
పెదాలు పదాలు పలకనంటుంటే...
మనసులోని వేధనంతా
ఎలా వెల్లడించాలి...
గాయపడిన గుండె మాట
ఎలా తెలుపాలి..?
పళ్ళ బిగువున దాగి ఆగి
పదం రానంది..
తనలోనే వొదిగి
అలిగి నలిగి ఉండిపోయింది...
లోలోన యుద్ధం ఏదో జరుగుతుంది..
నమ్మిన వారే మనను
గాయపెడుతుంటే...
గొంతులోని శ్వాస
ఎగిసి ఎగిసి పడుతుంటే..
గుండె వెలుపుల వేగం ఆగిపోతుంటే...
జీవితం నిర్జీవమై
ఓటమే తుదకు మిగిలింది..
ఈ జీవికి జీవం పోయింది...
వెలకట్టలేని ప్రేమకి ఆనకట్టలేని కన్నీళ్ళకి
కనికట్టుతో మంత్రం వేద్దామా?
కనిపెట్టుకుని ప్రేమగా చూసుకుందామా?
- ఎన్.జీవన్,
7989424164