Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెలియా!
నీతో చెలిమి చేయాలని
ఎంత ఆశగా ఉందో
నిను చూడలేని క్షణాలు
నీతో మాటాడలేని ఘడియలు
నీ పరవంతో ఆటాడలేని సవ్వడులు
నన్నెంత వెక్కిరిస్తున్నాయో..!
నీ వొళ్ళో నా వొళ్ళు దాచుకుని
నా వొళ్ళో నీ సొంపులు తీసుకుని
మెలి తిరగాలని
నువ్వు నేనై
నేనూ నువ్వై
సుడులు రేపాలనుకున్నా...
నా (నీ) మది నిరాశకు నేనేం చెప్పాలి!?
నువ్వే నా
జీవితాభరణమనుకున్నా
నువ్వు లేక నేను లేననుకున్నా...
నువ్వు దరిజేరవు
నన్ను చేరదీయవు
ఏం చేయాలని నాకీ పరీక్ష!?
మైనూ!
నా జానూ!!
నా మనసు నీ
షాడోతో షికారు చేయాలని
నీ అడుగుల ఎంగిలి
మడుగుల కింద
మిన్నులున్న వెన్నెలమ్మను
చూడాలని...
నువ్వు తానలేని
నా మది
మళ్ళీ మళ్ళీ
మరీ మరీ మీటుతున్నదే
నిన్ను వీడలేనంటూ
వీడి విడిపోనంటూ లాగుతున్నదే...
తకియా!
చెలిమాడుదాం రావా!?
పైలంగా
పరుగాడుదామా
పరవంగా మనువాడుదామా?
...
నీ ఇట్టం...
- మహేష్ దుర్గే,
8333987858