Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ని సార్లు చూసినా
తనివి తీరదు....
ఎన్ని ఏళ్ళు గడిచినా
తళుకు తగ్గదు...!!
చేమంతులతో
చేశారేమో ఆ చెక్కిళ్లు!
చూసినోడికి మాత్రం
పట్టక తప్పదు వెక్కిళ్ళు!!
పసుపుపచ్చ చీరలో
పరువమంత దాగింది!
పరవశించి నామనసు
పట్టుతప్పి ఊగింది!!
కనులముందు నీవుంటే
కలలెందుకు చెప్పు!
నీ సన్నిధి లేకుండా
బతకడమే తప్పు!!
-వెన్నెల సత్యం,షాద్నగర్
9440032210