నూకలమర్రి సర్పంచ్ అభ్యర్థి సోమినేని బాలు నవతెలంగాణ-వేములవాడరూరల్ గ్రామస్తుల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని నూకలమర్రి సర్పంచ్ అభ్యర్థి సోమినేని బాలు అన్నారు. మండలంలోని నూకలమర్రిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నానని తెలిపారు. గత ఎన్నికల్లో రెండు సార్లు ఓడిన ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాని అన్నారు.