నవతెలంగాణ-కలెక్టరేట్
హైదరాబాద్, కలకత్తా, బెంగుళూర్ నాగ్పూర్ వంటి పట్టణాల నుంచి బొకేలకు అవసరమైన పూలను సామగ్రిని తెప్పించుకుని తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటిలో ఎక్కువ శాతం కృత్రిమ బొకేలే ఉన్నాయి. చాల తక్కువ మొత్తం సహజమైన పూలతో తయారు చేస్తుంటారు. ఆర్డర్లపై ప్రత్యేకంగా ఇక్కడ అరుదుగా దొరికే జెర్బేరా, ఆర్బిడ్, కార్నేషన్ వంటి పూలతో కూడా బొకేలను తయారు చేస్తున్నారు. ఇవి కొంత ఖరీదు ఎక్కువ ఉండడంతో సంపన్న శ్రేణులు మాత్రమే వాడుతుంటారు. రూ.50 నుంచి మొదలుకొని రూ.5000వరకు బోకేలు అందుబాటులో ఉన్నాయి.
బొకేలకు భేలే గిరాకీ..
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగి అందులో విజయం సాధించిన ఎమ్మెల్యేలను వారి స్నేహితులు, శ్రేయోభిలాషలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వారిని కలిసి బొకేలను అందిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం అందిరికి అందుబాటులో ఉండే ధరలో లభిస్తున్నాయి. దీంతో బొకేలు కొనేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. గతంలో సంపన్నులు మాత్రమే బొకేలు ఉపయోగించే వారు ఇప్పుడు పట్టణ ప్రాంతాలను నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది.
వందలాది మందికి ఉపాధి...
జిల్లాలో 100కు పైగా బొకేల షాపులు ఉన్నాయి. ఒక నగరంలోనే 45షాపులు ఉన్నాయి. అందులో సుమారు ఐదు వందల మంది ఉపాధి పొందుతున్నారు. బొకేల తయారీ చేసే షాపులు పెట్టి కొందరు ఉపాధి పొందుతూ వారు మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో జిల్లాలో 500 మంది కుటుంబాలు ఈ దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటా..
బొకేల సంస్కృతి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైంది. ప్రారంభంలో చాల తక్కువ మంది మాత్రమే బొకేలు కొనేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. వందకు పది మంది కొనుగొలు చేస్తున్నారు. కరీంనగర్లో బొకే కల్చర్ విస్తరించింది. నగరంలో సుమారు 45వరకు బొకే షాపులు ఉన్నాయి. మా నాన్న నుంచి నేను నేర్చుకొని 40సంవత్సరాలుగా ఇదే వృత్తిని జీవిస్తున్నా.
ఎండీ.సల్మాన్ బొకే షాపు యజమాని
అభినందనలు తెలిపేందుకు..
పదోన్నతలు, రిటైర్మెంట్ అయినప్పుడు, విద్యార్థులు ర్యాంకులు సాధించినప్పుడు, నాయకుల ప్రమాణస్వీకారం వంటి కార్యక్రమాలకు బొకేలు కొనుగోలు చేస్తుంటారు. బొకేతో సత్ససంబంధాలు నెలకొల్పబడుతాయి. సోషల్ మీడియా, ఫోన్ ద్వారా తెలిపే శుభాకాంక్షలు అభినందనల కంటే బొకేలు అందించి చెప్పడం ద్వారా సత్సంబంధాలు మరింత మెరుగుపడుతాయి.
అమర్ బొకే డెకరేటర్
Authorization