రుద్రంగి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అంబటి లావణ్య రాములు నవతెలంగాణ-రుద్రంగి తనను సర్పంచ్‌గా గెలిపిస్తే సమస్య రహిత గ్రామంగా తీర్చిదిద్దుతానని రుద్రంగి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అంబటి లావణ్య రాములు అన్నారు. గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో గడప వేణు, పిసరి రామస్వామి, రవి, శ్రీనివాస్, ఆనందం, నరసయ్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.