నవతెలంగాణ-మంకమ్మతోట టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి కాళిదాసు రేణుకాదేవి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తన రాజీనామాను టీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు సర్దార్ రవిందర్సింగ్కు అందజేసినట్టు పేర్కొన్నారు. పార్టీ నుంచి కార్పొరేట్ టికెట్ ఆశించగా పార్టీ మాత్రం గుర్తింపు ఇవ్వలేదని తెలిపారు. 29వ డివిజన్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసినట్టు పేర్కొన్నారు.