- ఎరువుల వినియోగం తగ్గించాలి
- గ్రామ పాలకవర్గంతో పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్
- గర్రెపల్లిలో గ్రామసభ
నవతెలంగాణ -సుల్తానాబాద్ రూరల్
పల్లెల్లో పారిశుధ్య నిర్వహణపై గ్రామ పాలక వర్గం ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లిలో శనివారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిం చిన కలెక్టర్ ఆదివారం ఉదయం గ్రామసభ నిర్వహిం చారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ కోసం ట్రాక్టర్ కొనుగోలు చేశామని, నాలుగు ట్రై సైకిళ్ళ సహకారంతో చెత్త సేకరణ ప్రక్రియ జరుగుతుందని అధికారులు వివ రించారు. శ్మశాన వాటిక పనులు 15 రోజులలో పూర్తి చేయాలని, ట్రాక్టర్ తో పాటు ట్యాంకర్ ఇతర పరికరాల ను త్వరగా సమకూర్చుకుని వినియోగంలోకి తీసుకొని రావాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు మార్లు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించామని, ఆ స్ఫూర్తితో పనులు నిరంతరం కొనసాగించాలని చెప్పారు. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సంచార ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను పూర్తిస్థాయిలో తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో కొందరు వృద్ధులకు రేషన్ సంబంధించి బయోమెట్రిక్ విధానంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి దృష్టికి తీసుకురాగా స్థానిక వీఆర్ఏ మీసేవ కేంద్రంలో సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో సాగు, రైతులు వివరాలు, రైతుబంధు డబ్బుల జమ గురించి తెలుసుకున్నారు. నూతనంగా పాసుబుక్ అందిన రైతులు పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎరువుల వినియోగం తగ్గించాలని, ఇందుకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. గర్రెపల్లి గ్రామ పరిధిలో సౌమ్య వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారని, సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని చెప్పారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే నూతన చట్టం ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి అందరూ చిత్తశుద్ధితో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వి.సుదర్శన్, జెడ్పీ సీఈఓ వినోద్‌కుమార్, పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, డీఈఓ జగన్ మెహన్ రెడ్డి, సర్పంచ్ సుజాత, ఎంపీపీ బాలాజీ రావు, ఎంపీటీసీ అనూష పాల్గొన్నారు.
Authorization