Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కళాశాలను ప్రారంభించాలని ఆదేశించడంతో బోనకల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బోనకల్ సర్పంచ్ భూక్య సైదా నాయక్ ఆధ్వర్యంలో కళాశాల తరగతి గదులను బోనకల్ గ్రామపంచాయతీ సిబ్బంది చేత శుభ్రపరిచి, శానిటైజర్ చేయించారు అదేవిధంగా కాలేజీ గ్రౌండ్ మొత్తం డోజర్ సహాయంతో శుభ్రం చేయించారు. కాలేజీ మొత్తం ప్రస్తుతం హంగులు ఆర్భాటాలతో ప్రారంభానికి ముస్తాబయింది ఈ సందర్భంగా సర్పంచి సైదా నాయకులను కళాశాల ప్రిన్సిపాల్ జె . జోనతాన్ బాబు కళాశాల సిబ్బంది అభినందించి నుంచి కతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అయినా ఎన్.ప్రసాద్ బాబు, ఏ.శ్రీనివాసరావు, ఏఏ.రాజేంద్ర కుమార్ పి.లక్ష్మికాంతం, వి.రామకృష్ణ, డి.పద్మావతి ఎస్.రాజేంద్ర ఏ.తిరుపతిరావు, ఏ.మురళీకృష్ణ, జి.ధనలక్ష్మి జి.ప్రేమ్ కుమార్రెడ్డి, శ్రీధర్, పి.రవి పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.