Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలుగు సాహిత్యం అనువాదంతోనే మొదలైందని , అనువాదం అంటే ప్రపంచలోని భిన్న జీవన విధానాలను సంస్కృతులను అనుసంధానం చేయడమేనని ప్రముఖ కవి, అనువాదకులు మేడ్చల్ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. స్థానిక ఎస్.ఆర్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల ఇంగ్లీష్-తెలుగు-హిందీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకిరుల్లా అద్యక్షతన అనువాద కళ అనే అంశంపై శనివారం నిర్వహించిన కార్యశాలలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. ప్రస్తుతం సమాచార అనువాదం యువత కు ఉపాధి ని కలిగి స్తుందన్నారు. మరో ముఖ్య వక్త ప్రముఖ కవి అనువాదకులు ఎలనాగ మాట్లాడుతూ అనువాదం మూడు రకాలుగా ఉంటుందని విపులంగా విద్యార్థులకు వివరించారు.అనువాదంలో ఉండే ఇబ్బందులు కష్టాన్ని సోదాహరణంగా వివరించారు.గౌరవ అతిధులుగా పాల్గొన్న విద్యావేత్త కళాశాల పాలకమండలి సభ్యులు రవిమారుత్ మాట్లాడుతూ ప్రపంచం భిన్న సంస్కతులు, భాషల సమూహమని వీటిని పరస్పరం అనుసంధానం చేసేది అనువాదమేనన్నారు. గౌరవం అతిధి స్వేచ్ఛ టి.వి.సీ.ఈ.ఓ ఐ.వి.రమణారావు తమ సందేశంలో మూల,లక్ష్యభాషలమీద సంస్కతుల మీద అనువాద కుడికి పట్టు ఉండాలన్నారు. ఇంగ్లీష్ విభాగం ఆచార్యులు వైస్ ప్రిన్సిపాల్ కె.ఎస్.ఎస్.రత్నప్రసాద్ కార్యక్రమ లక్ష్యం ప్రాధాన్యతలను వివరించారు.తొలుత కాళోజీ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కవి విమర్శకుడు కాళోజీ అవార్డు గ్రహీత కె.యు.పాలకమండలి సభ్యులు తెలుగు అధ్యాపకులు డా.సీతారాం స్వాగత వచనాలు పలికారు.హిందీ విభాగాధిపతి సాంబశివరావు హిందీ అనువాద ప్రాధాన్యత ను కార్యశాల ఉద్దేశాలను తెలిపారు.కార్యక్రమంలోవివిధ కళాశాలల నుంచి పాల్గొన్న 44 మంది కార్యశాలలో మెళుకువలు నేర్చుకున్నారు. కళాశాల తెలుగు అధ్యాపకులు పి.వెంకటేశ్వర్లు, ఎం.వి.రమణ మహిళా కళాశాల అధ్యాపకురాలు క్రిష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.చివరగా సర్టిఫికెట్ల ను అందజేశారు.