Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ అని స్థానిక జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు అన్నారు. మండలంలో పలువురు పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా సీఎం సహాయ నిధి నుండి మంజూరైన మూడు చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ.. నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అమలు చేస్తుందని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముగ్గురికి చెక్కులు మంజూరయ్యాయని, మర్కోడు గ్రామానికి చెందిన రావుల విజయకు రూ.34,000లు, రాఘవాపురం గ్రామానికి చెందిన గొగ్గెల రామారావుకు రూ.21,000లు, పాతూరు గ్రామానికి చెందిన గొగ్గెల కాంతయ్యకు రూ.60,000లు చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు కొమరం శంకర్ బాబు, కొమరం నరసింహారావు, గొగ్గెల ప్రేమకళ, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాయం నరసింహారావు, షేక్ బాబా తదితరులు పాల్గొన్నారు.