Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుమ్మల అనుచరుడిగా గణేష్ చెలామణి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని దుమ్ముగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చుక్కా గణేష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. తుమ్మల వర్గంలో ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్న గణేష్ రెడ్డి డివిజన్ నాయకత్వ పోకడలు నచ్చకే రాజీనామా పత్రాన్ని నియోకవర్గ ఇన్చార్జీ తెల్లం వెంకట్రావ్‌కు అందజేసినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో డివిజన్ నాయకత్వం తప్పిదం మూలంగానే టీఆర్ఎస్ ఓటమి పాలయిందని ఆరోపించారు. మండల నాయకత్వం సైతం సీనియర్ నాయకులను పూర్తిగా విస్మరించిందని, దీంతో పార్టీలో ఇమడ లేక రాజీనామా చేస్తున్నాని ఆయన వెల్లడించారు.