Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల సర్పంచ్ స్థానాలకు, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయా పంచాయతీలు, వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయినట్టయింది. ప్రధానంగా పాల్వంచ మండలంలోని నారా యణరావుపేట ఎస్సీ కాలనీ పంచాయతీ సర్పంచ్ స్థానం గిరిజనులకు రిజర్వ్ చేయగా ఆ గ్రామంలో ఒకే ఒక్క గిరిజన కుటుంబం మాత్రమే ఉంది. ఆ ఒక్క కుటుంబం కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండటంతో వారికి పోటీచేసే అవకాశం లేకుండాపోయింది. ఇదే మండలంలోని సంగం గ్రామపంచాయతీ సర్పంచ్‌కు కూడా గిరిజనుల్లేకపోవడంతో ఇక్కడ కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. ఇలాగే పలుచోట్ల వార్డులకు కూడా కొన్ని చోట్ల అభ్యర్థుల్లేక, మరికొన్నిచోట్ల అభ్యర్థులకు ఇష్టంలేక నామినేషన్లు దాఖలుకాలేదు.
ఖమ్మం, భద్రాద్రిజిల్లాల్లో నేటినుండి జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భద్రాద్రిజిల్లా పాల్వంచ మండలంలోని నారాయణపేట ఎస్సీకాలనీ పంచాయతీకి, అదే మండలంలోని సంగం పంచాయతీకి జరగాల్సినసర్పంచ్ స్థానానికి ఏఒక్క అభ్యర్థినుండీ నామినేషన్ దాఖలుకాలేదు. ఫలితంగా ఆ రెండు పంచాయతీల్లో సర్పంచ్ స్థానానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగింది. అలాగే ఖమ్మం జిల్లాలోని మొదటి విడతలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి 3వార్డులు, రెండో విడతకు సంబంధించి 18వార్డులకు నామినేషన్లు దాఖలుకాలేదు. భద్రాద్రిజిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 31వార్డులు, రెండో విడతకు సంబంధించి 5వార్డులకు అభ్యర్థులెవరూ తమ నామినేషన్లు దాఖలు చేయలేదు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల సమాచారం..
ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరిగే పంచాయతీల వివరాలు
ఫేజ్ సర్పంచ్ వార్డులు
తొలివిడత 188 1736
రెండో 204 1862
మూడో 192 1740
మొత్తం 584 5338
భద్రాద్రిజిల్లాలో ఎన్నికలు జరిగే పంచాయతీల వివరాలు
ఫేజ్ సర్పంచ్ వార్డులు
తొలివిడత 174 1539
రెండో 142 1294
మూడో 163 1404
మొత్తం 479 4232
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కనామినేషన్ దాఖలుకాని పంచాయతీలు 2, వార్డులు మొత్తం 57ఉన్నాయి.జిల్లా మండలం ఒక్కనామినేషన్రానిజీపంచాయతీలు కారణం
భద్రాద్రి పాల్వంచ నర్సింహారావుపేట ఎస్సీకాలనీ అభ్యర్థుల్లేకపోవడంతో నామినేషన్లు దాఖలుకాలేదు భద్రాద్రి పాల్వంచ సంగం అభ్యర్థుల్లేకపోవడంతో నామినేషన్లు దాఖలుకాలేదు
భద్రాద్రిజిల్లాలో తొలివిడతలో నామినేషన్లు దాఖలుకాని వార్డుల వివరాలు..
భద్రాద్రి అశ్వాపురం రామచంద్రాపురం 2,4వార్డులు అభ్యర్థుల్లేకపోవడంతో నామినేషన్లు దాఖలుకాలేదు
అశ్వాపురం మనుబోతులచెరువు 1,2,3,4
చర్ల కొత్తపల్లి 3,4వార్డులు
దుమ్ముగూడెం లక్షీనగరం 4వవార్డు
పాల్వంచ నారాయణరావుపేట 1,3,5
పాల్వంచ సంగం 1,5,6,7
పాల్వంచ దంతెబోర 1,2,4,8
పాల్వంచ బంద్రుగొండ 2,6,7,8
పాల్వంచ పాండురంగాపురం 1,2,5,6
పాల్వంచ బసవతారకకాలనీ 2,3,5
రెండో విడత-భద్రాద్రిజిల్లాలో...
అశ్వారావుపేట కేసప్పగూడెం 1వ వార్డు
చుంచుపల్లి అంబేద్కర్‌నగర్ 1,2,3
చుంచుపల్లి రాంపురం 6వ వార్డు
ఖమ్మంజిల్లాలో తొలివిడతలో నామినేషన్లు దాఖలుకాని వార్డుల వివరాలు..
ఖమ్మం ముదిగొండ ఎడవల్లి లక్ష్మీపురం 3వ వార్డు
నేలకొండపల్లి సుర్దేపల్లి 3వవార్డు
కామెపల్లి జాస్తిపల్లి 6వ వార్డు
ఖమ్మంజిల్లాలో రెండో విడతలో నామినేషన్లు దాఖలుకాని వార్డులు
ఏన్కూరు నూకాలంపాడు 5,6,7,8
ఏన్కూరు ఆరెకాలయపాడు 1,4,5,6
తల్లాడ కొడవటిమెట్ట 3వ వార్డు
కల్లూరు తెలగవరం 1వవార్డు
పెనుబల్లి గౌరారం 1,2,3,7
సింగరేణి కమలాపురం 1,2,6,7
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీలు
మొదటి విడత
ఖమ్మం జిల్లాలో 21
భద్రాద్రి జిల్లాలో 22
రెండో విడత
ఖమ్మం జిల్లాలో 34
భద్రాద్రిజిల్లాలో 20
మూడో విడత
ఖమ్మం జిల్లాలో 15
భద్రాద్రిజిల్లాలో 01